ఎమ్మిగనూరు పట్టణ కేంద్రంలోని సంజీవయ్య నగర్ ప్రాథమిక స్కూల్ ఆవరణం నందు మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసన్న ఆధ్వర్యంలో ఘనంగా జ్యోతిరావు పూలే 198వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల నరసన్న మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిబా ఫూలే మహిళా విద్యకు మార్గదర్శకత్వం వహించారని, 1848లో తన భార్య సావిత్రిబాయి ఫూలేతో కలిసి బాలికల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించారని చెప్పారు.