గోనెగండ్ల మండలంలోని గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యలను రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కరించుకోవాలని మండల తహశీల్దార్ కుమారస్వామి పిలుపునిచ్చారు. గురువారం మండల పరిధిలోని హెచ్. కైరవాడిలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. తహశీల్దార్ మాట్లాడారు. రైతులు భూ సమస్యలను అర్జీల రూపంలో అధికారుల దృష్టికి తీసుకువస్తే, వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.