చేగువేరా ఆశయాలను కొనసాగిద్దామని డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్, మాజీ నాయకుడు గోవిందు పిలుపునిచ్చారు. శనివారం ఎమ్మిగనూరు సీపీఎం కార్యాలయంలో ఆయన 97వ జయంతిని ఘనంగా నిర్వహించారు. వారు మాట్లాడుతూ, చె గువేరా 1928 జూన్ 14న ఆర్జెంటీనాలో జన్మించి, పేదరికం, ఆకలితో చలించి విప్లవ మార్గం ఎంచుకున్నారని తెలిపారు. నేటి ప్రభుత్వాలు మోసం చేస్తుండగా, ఉపాధి కోసం పోరాడాలన్నారు.