ఎమ్మిగనూరు పట్టణంలోని శ్రీనీలకంఠేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి శనివారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఆదేశిస్తూ, భద్రత కట్టుదిట్టం చేయాలని సూచించారు. తాగునీళ్లు, శౌచాలయాలు, ఎల్ఈడీ స్క్రీన్, డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పట్టణంలో ఎలాంటి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.