ఎమ్మిగనూరు పట్టణంలోని నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మోహన్ రెడ్డి మెమోరియల్ అంతర్ రాష్ట్ర వాలీబాల్ టోర్నమెంట్-2025 ప్రారంభం అవుతోందన్నారు. ఈనెల 15 నుంచి 17 వరకు ప్రభుత్వ కళాశాలలో జరుగుతుందని, గెలుపొందిన వారికి వరసగా రూ. 40 వేలు, రూ. 30 వేలు, రూ. 20 వేలు, రూ. 10 వేలు ఇస్తామన్నారు. వివరాలను 9542148670, 9849844326, 9885694635 సంప్రదించాలని ఆదివారం తెలిపారు.