రాష్ట్రంలో ఆర్థిక కష్టాలను అధిగమిస్తూ ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వంలో విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తుందని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని నిలిపివేసి విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి ప్రారంభించిందన్నారు.