ఎమ్మిగనూరు: రూ.5 లక్షల బీమా చెక్కు అందజేత

57చూసినవారు
ఎమ్మిగనూరు: రూ.5 లక్షల బీమా చెక్కు అందజేత
ఎమ్మిగనూరు మండలం పరమాన్‌‌దొడ్డి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త బి. వీరేష్ ఇటీవలే జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో టీడీపీ నుంచి వారి కుటుంబానికి రూ.5 లక్షల ప్రమాద బీమా మంజూరైంది. బుధవారం ఈ పరిహార చెక్కును ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి మృతుడి భార్య పద్మకు అందజేశారు. టీడీపీ సభ్యత్వంతో రూ.5 లక్షల బీమా అందిందని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్