ఎమ్మిగనూరు పట్టణంలో ఈనెల 20న మినీ మహానాడు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ కార్యాలయం నుంచి విడుదల చేసిన ప్రకటన ద్వారా కుర్ని కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. కార్యకర్తలు, కుటుంబ సారథులు, బూత్ కన్వీనర్లు, పట్టణ కమిటీ సభ్యులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.