ఎమ్మిగనూరు పట్టణం 16వ వార్డులో ఆదివారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే డా. బివి జయ నాగేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు కౌన్సిలర్ వాహిద్ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు మహేష్, ఖలీల్, జిలాని, సభరేష్ బేగ్ పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ఎన్నికల హామీలు, అమలు చేసిన పథకాలు, ఇంకా చేయాల్సిన పనులపై ప్రజలకు వివరించి, వారి సమస్యలు తెలుసుకున్నారు.