కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ బుధవారం ఎమ్మిగనూరు పట్టణంలో సీపీఐ, కాంగ్రెస్ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. సోమప్ప సర్కిల్ వద్ద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.