బనవాసి బాలికల గురుకుల కళాశాలను శుక్రవారం ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి సందర్శించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో విద్యార్థినులపై గీత పడినా తోలు తీసేస్తామని అధికారులను హెచ్చరించారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కూటమి ప్రభుత్వం తీసుకునే చర్యలు కఠినంగా ఉంటాయన్నారు. లైంగిక వేధింపులకు గురిచేసిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.