భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు పునరుద్ధరించాలని సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు గోవిందు, కాజా పాషా డిమాండ్ చేశారు. శనివారం ఎమ్మిగనూరులో భవన నిర్మాణ కార్మికులు సమావేశంలో వారు మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో వెల్ఫేర్ బోర్డు 1500 కోట్లతో ఏర్పాటు చేశారని తెలియజేశారు. ప్రభుత్వ హామీలు అమలు చేయాలన్నారు.