ఎమ్మిగనూరు: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

59చూసినవారు
ఎమ్మిగనూరు: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
ఎమ్మిగనూరు పట్టణంలోని మేకల బజార్ లో సోమవారం అనుమానాస్పద స్థితిలో కుమ్మరి ఉపేంద్ర (20) మృతి చెందాడు. అతను నారాయణ కాలేజీలో ఇంటర్‌ పూర్తి చేసిన అనంతరం బీ-ఫార్మసీకి అర్హత సాధించాడు. అతని తండ్రి శ్రీనివాసులు, రెండో భార్య లక్ష్మీదేవితో కలిసి కూరగాయల మార్కెట్లో మట్టి కుండలు విక్రయించి జీవనం సాగిస్తున్నారు. ఈనెల 2న ఆయన ఇంటికి వచ్చి నిద్రించి ఇలా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు, సీఐ శ్రీనివాసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్