ఎమ్మిగనూరు: యువత అంబేద్కర్ జీవితాన్ని అధ్యయనం చేయాలి

50చూసినవారు
ఎమ్మిగనూరు: యువత అంబేద్కర్ జీవితాన్ని అధ్యయనం చేయాలి
నేటి యువత అంబేద్కర్ జీవితాన్ని అధ్యయనం చేయాలని, ఆయన చూపిన విలువలను అనుసరించాలని ఎమ్మిగనూరు వైఎస్సార్‌సీపీ నాయకులు బూట్టా నీలకంఠ అన్నారు. సోమవారం ఎమ్మిగనూరులో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వీరశైవ లింగాయత్ విభాగం అధ్యక్షులు రుద్రగౌడ్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతగా, సమానత్వానికి మార్గదర్శిగా, బహుళసామాజిక వ్యవస్థలో బలహీన వర్గాలకు ఆశాకిరణంగా నిలిచిన మహోన్నత వ్యక్తి అని అన్నారు.

సంబంధిత పోస్ట్