ఎమ్మినూరు: బిర్యాని ఆకుపై అంబేద్కర్- రాజ్యాంగ వజ్రోత్సవ చిత్రం

81చూసినవారు
ఎమ్మినూరు: బిర్యాని ఆకుపై అంబేద్కర్- రాజ్యాంగ వజ్రోత్సవ చిత్రం
ఎమ్మినూరు పట్టణానికి చెందిన చిత్ర కళాకారుడు కదిరికోట అశోక్ బిర్యాని ఆకుపై ఆదివారం భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ రాజ్యాంగం రచిస్తున్న చిత్రంతోపాటు రాజ్యాంగానికి 75 ఏళ్లు నిండిన సందర్భంగా వజ్రోత్సవాల ప్రతిమను, రాజ్యాంగంలో ఆడ, మగకు సమాన హక్కులు, అంటరానితనం నిర్మూలన కోసం "మహద్" చెరువులో నీళ్లు తాగించడం వంటి నమూనాలతో కూడిన చిత్రాలను బిర్యాని ఆకుపై వేయడం పలువురిని ఆకట్టుకుంది. రాజ్యాంగం వజ్రోత్సవాలు, అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు సందర్భంగా ఈ పెయింటింగ్ వేశానని అశోక్ తెలిపారు.

సంబంధిత పోస్ట్