ఇసుక దోపిడీ చేసి పెద్దపెద్ద ప్యాలెస్లు కట్టించారు: బీవీ

73చూసినవారు
ఏపీలో ఇసుక ఫ్రీగా చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కిందని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు. గతంలో వైసీపీ నాయకులు ఇసుకను పేద ప్రజలకు అమ్ముకొని పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకున్నారన్నారు. చంద్రబాబు పరిపాలన చేయాలని ప్రజలు తీర్పు ఇచ్చారని, ప్రజలకు సేవచేసి ప్రజల రుణం తీర్చుకుంటారన్నారు. గాజులదిన్నె ప్రాజెక్ట్ నాగలదిన్నె ఇసుక ఇవ్వడానికి అధికారులు ఒప్పుకోవడం లేదని అన్నారు.

సంబంధిత పోస్ట్