గోనెగండ్ల: కూటమి ప్రభుత్వం మోసపూరితమైంది: బుట్టా రేణుక

69చూసినవారు
గోనెగండ్ల: కూటమి ప్రభుత్వం మోసపూరితమైంది: బుట్టా రేణుక
ప్రజలను ఇంత మోసం చేసిన కూటమి ప్రభుత్వం లాంటిది దేశంలో మరొకటి లేదని ఎమ్మిగనూరు వైఎస్సార్సీపీ నియోజకవర్గం ఇన్ఛార్జి బుట్టా రేణుక విమర్శించారు. శనివారం గోనెగండ్ల మండల కేంద్రంలో పర్యటించిన ఆమె మాట్లాడుతూ వైసీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు సమస్యలు చెప్పుకునేందుకు వైఎస్సార్సీపీ కార్యాలయం ఉపయోగపడుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం మోసపూరితమైందని విమర్శించారు.

సంబంధిత పోస్ట్