ఎమ్మిగనూరు పట్టణంలోని రావూస్ డిగ్రీ కళాశాల యందు 181వ గురజాడ వెంకటఅప్పారావు జయంతిని సీఈఓ తిరుమలరెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల తెలుగు అధ్యాపకులు పాల్ రాజ్, అన్నపూర్ణ మాట్లాడుతూ గురుజాడ వాడుక భాషలో రచనలు రాసి సమాజంలో పేరుకుపోయిన రుగ్మతల రూపుమాపడానికి కృషి చేశారు. తాను రాసిన 'కన్యాశుల్కం' నాటకం ఆనాటి సమాజాన్ని ఎండ కట్టిందని తెలిపారు.