ఎమ్మిగనూరు పట్టణంలో 11వ వార్డులో మంగలి రామలింగమ్మ అనే వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందారు. ఈమె కోడలు (పార్వతి) పట్టణంలో స్వీపర్ గా పని చేస్తోంది. పట్టణంలోని చిన్నపిల్లల వైద్యులు బాలాజీ, ఆర్థోపెడిక్ వైద్యులు మల్లికార్జున, ఆపిల్ ల్యాబ్ అధినేత బీరప్ప, నరసింహుడు రామలింగమ్మ మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం మట్టి ఖర్చులకు రూ.10వేలు ఆర్థిక సహాయం అందజేశారు.