ఎమ్మిగనూరులో భర్త ఇంటి ముందు భార్య బైఠాయించి ఆందోళన

58చూసినవారు
ఎమ్మిగనూరులో భర్త సాదిక్ ఇంటి ముందు భార్య తస్లీమ్ బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆమెకు మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి. తస్లీమాకు కొన్నేళ్ల క్రితం వివాహం కాగా ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొన్ని రోజులుగా భర్త, అత్త, బావలు వేధిస్తున్నారంటూ ఆమె ఆరోపించారు. పిల్లలను భర్త తన వద్ద ఉంచుకొని, తనను పుట్టింటికి పంపించారని, తనకు న్యాయం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్