ఎమ్మిగనూరు మండలం కోటేకల్ గ్రామానికి చెందిన రాజేశ్వరి (21), తనకు పెళ్లి ఇష్టం లేదని చెప్పినా, పెద్దల ఒత్తిడి వల్ల రెండు నెలల క్రితం హనుమంతుతో వివాహం చేయడంతో శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. వారం క్రితం పుట్టింటికి వచ్చిన ఆమెను భర్తతో ఇంటికి వెళ్లాలని చెప్పడంతో, తీవ్ర ఆవేదనలో ఆమె ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి చికిత్స చేపట్టగా మృతి చెందినట్లు తెలిపారు.