కర్నూలు నగరంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 గంటలకు సునయన ఆడిటోరియంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదులను పంచుకోవచ్చు అని, ఈ కార్యక్రమం జిల్లావ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా జరగనుందన్నారు. అర్జీ పరిష్కారం సమాచారం కోసం 1100 కు కాల్ చేయవచ్చని సూచించారు.