రాష్ట్రంలో కుటమి ప్రభుత్వం ఏడాదిలో పాలనలో పూర్తి అయ్యిందని, ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ ఏమైందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చంద్రబాబును ప్రశ్నించారు. బుధవారం కర్నూలు కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతూ కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా నాయకులు, కార్యకర్తలు హాజరై సంస్థాగత లోపాలను పీసీసీ దృష్టికి తీసుకువచ్చారు.