కర్నూలులో వైసీపీ నేతలు వెన్నుపోటు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆదివారం కర్నూలులో ఎమ్మిగనూరు వైఎస్సార్సీపీ ఇన్‌చార్జి బుట్టారేణుక, మాజీ ఎమ్మెల్యే కంగ్రాటి శ్రీదేవమ్మ, విజయ మనోహరితో కలిసి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసి, హామీలు నెరవేర్చక ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ఈ పుస్తకం ప్రజలకు నిజాన్ని తెలియజేసే ఆయుధమని అన్నారు.