నందవరం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ, జడ్పీ హైస్కూల్ బాలికల విద్యాలయాన్ని శుక్రవారం ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా రూ. 2. 55 లక్షలతో నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. తదుపరి స్కూల్ భవనాలను పరిశీలించి, విద్యార్థినులకు బ్యాగులు, పుస్తకాలు పంపిణీ చేశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, విద్య అందించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.