నందవరం: రైతులకు రాయితీపై యూరియా, ఎరువులు పంపిణీ

0చూసినవారు
నందవరం: రైతులకు రాయితీపై యూరియా, ఎరువులు పంపిణీ
నందవరం మండలంలో ప్రాథమిక సహకార సంఘం ద్వారా శనివారం రైతులకు రాయితీపై యూరియా, ఎరువులను ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు. రైతుల శ్రేయస్సు కోసం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సాగులో అధునాతన పద్ధతులను వాడి దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు. ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్