నియోజకవర్గ పరిధిలోని మసీదుపురం గ్రామ దేవాలయంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి శ్రావణ మాసం రెండో గురువారం సందర్భంగా మహిళలు కుటుంబసమేతంగా తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. ముందుగా భక్తులు తెల్లవారుజామున లేచి స్నానాలు చేసి, స్వామివారికి అభిషేకం, ఆర్చన పూజలు నిర్వహించి స్వామికి ఇష్టమైన రవ్వ భక్షలతో సమర్పించారు. శ్రావణమాసంలో అత్యంత భక్తిశ్రద్ధలతో మహిళలు పూజలు నిర్వహిస్తున్నారు.