గోనెగండ్ల నూతన తహసిల్దార్ గా రాజేశ్వరి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్‌ను కలిసి పూలమొక్కను అందజేశారు. నూతన పదవిలోకి వచ్చిన ఆమె, శాఖల నిర్వహణ, ప్రజలకు సేవలందించే విధానాలపై సబ్ కలెక్టర్‌తో చర్చించారు. విధి నిర్వహణ మార్గదర్శకాలను అనుసరిస్తానని తహసీల్దార్ రాజేశ్వరి తెలిపారు. సమావేశంలో ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు.