కూటమి ప్రభుత్వ ఏడాది పాలనను పురస్కరించుకొని బుధవారం సోమప్ప సర్కిల్ నుంచి గుడేకల్లు వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని మంగళవారం ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమాభివృద్ధిని ప్రజలకు వివరిస్తామన్నారు. విజయోత్సవ ర్యాలీని జయప్రదం చేసేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, తరలి రావాలన్నారు.