ఇసుకను అక్రమంగా రవాణ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సి. బెళగల్ ఎస్సై తిమ్మారెడ్డి అన్నారు. శనివారం పోలీస్ సిబ్బందితో కలిసి గ్రామాల్లో గస్తీ నిర్వహించారు. తుంగభద్ర నదీతీరంలోని తిమ్మందొడ్డి నుంచి ఇసుకను తరలిస్తున్న నాగులదిన్నె, ఎమ్మిగనూరుకు చెందిన ఉరుకుందు, మాబాషాల ట్రాక్టర్లను సీజ్ చేశారు. కేసు నమోదు చేసి వాహనాలను రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఇసుక అక్రమ రవాణాపై పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.