రిలయన్స్ ఫౌండేషన్, కృషిజ్ఞాన కేంద్రం బనవాసి ఆధ్వర్యంలో బుధవారం గోనెగండ్ల మండలంలోని ఎర్రబాడు, ఒంటెడుదిన్నె, గంజిహళ్లి గ్రామ పత్తి రైతులకు టెలికాన్ఫరెన్స్ కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీకే కో ఆర్డినేటర్ మరియు ప్రధాన శాస్త్రవేత్త రాఘవేంద్ర చౌదరి మాట్లాడుతూ గత మూడు రోజులుగా అధిక వర్షాలు కురిశాయని, పొలంలో నీరు మొత్తం తీసివేయాలని, పత్తిలో అదునుకు వచ్చిన కాయలు కుళ్ళిపోవడం జరుగుతుందన్నారు.