ఎమ్మిగనూరులో ఎల్లమ్మ బీడీ కాలనీలో ఎరుకుల నాగన్న అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలసి ఆదివారం ఆందోళన చేపట్టారు. ఆందోళనకు రాష్ట్ర గిరిజన సంఘం నేతలు మద్దతు పలికారు. సర్వే నంబర్ 512/ఏ2లో ఉన్న 30 సెంట్లు స్థలాన్ని కొనుగోలు చేశానని, అయితే పట్టణానికి చెందిన కొంతమంది వ్యాపారులు తనకు చెందిన 30 సెంట్లు స్థలాన్ని నకిలీ పత్రాలతో కబ్జా చేశారని నాగన్న ఆరోపిస్తున్నాడు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలన్నారు.