పాకిస్తాన్ ఉగ్రమూకలకు భారత సైన్యం గట్టిగా గుణపాఠం చెప్పిందని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం ఎమ్మిగనూరులో ఆపరేషన్ సిందూర్‌కు మద్దతుగా ఘనంగా తిరంగా యాత్ర నిర్వహించారు. శ్రీనివాస సర్కిల్ నుంచి సోమప్ప సర్కిల్ వరకు 300 అడుగుల జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి నేతృత్వం వహించారు. ప్రజలు జై జవాన్, వందేమాతరం నినాదాలతో మార్మోగింది.