కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో శనివారం తెలుగుదేశం పార్టీకి ఇద్దరు మాజీ కౌన్సిలర్లు, పట్టణ మాజీ కార్యదర్శి రాజీనామా చేశారు. 29వ వార్డు మాజీ కౌన్సిలర్ మధుబాబు, మాజీ కార్యదర్శి చేనేత మల్లికార్జున, టీడీపీ గెలుపుకు కృషి చేసినా గౌరవం లభించలేదని పేర్కొంటూ, పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. తమ అనుమతితో మరికొందరు కూడా పార్టీ నుంచి వెళ్లనున్నట్లు తెలిపారు.