బిహార్ సంకీర్ణ ప్రభుత్వంలో తలెత్తిన రాజకీయ సంక్షోభంతో ఆర్జేడీ అప్రమత్తమైంది. మహాకూటమి నుంచి బయటకు రావాలని సీఎం నితీష్ కుమార్ తీసుకున్న నిర్ణయంతో తదుపరి కార్యచరణపై ఆర్జేడీ కసరత్తు ప్రారంభించింది. బిహార్‌లో తమకే ఎక్కువ మెజారిటీ ఉందని లాలూ ప్రసాద్ అన్నారు. చిన్న పార్టీలతో కలిసి తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ అభిప్రాయపడ్డారు.