బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఫెంగల్ తుఫాన్‌గా మారిందని ఏపీ వెదర్ మ్యాన్ సాయి ప్రణీత్ తెలిపారు. తుఫాన్ మరింత బలోపేతం చెందే అవకాశాలున్నాయన్నారు. ఈ తుఫాన్ చాలా నెమ్మదిగా కదులుతుందని.. దీని వల్ల దక్షిణ కోస్తాపై భారీగా ప్రభావం ఉంటుందని అన్నారు. తిరుపతి, శ్రీకాళహస్తిలో అర్థరాత్రి తర్వాత భారీ వర్షాలు కురవనున్నాయని వెల్లడించారు. రేపు, ఎల్లుండి కోస్తాంధ్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయని తెలిపారు.