రాజ్ తరుణ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో కీలక నిందితుడు మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో లావణ్య తాజాగా నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కు మరోసారి వచ్చారు. ఈ క్రమంలో ఆమె సాయి డ్రగ్స్ కోణాన్ని బయటపెట్టి.. పలు ఆధారాలను పోలీసులకు అందజేసింది. అలాగే బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాషాపై కూడా ఫిర్యాదు చేసింది. శేఖర్ బాషా, సాయి తనను డ్రగ్స్ కేసులో ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె పేర్కొంది.