
డీఐజీ కిరణ్ వికృత చేష్టలు.. కేసు నమోదు
TG: స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖలో నెల్లూరు డీఐజీగా పనిచేస్తున్న కిరణ్ కుమార్ వికృత చేష్టలు బయటపడ్డాయి. పలువురు మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకుని.. వేరే మహిళలతో ఉన్న ఫోటోలు భార్యకు పంపి వేధింపులకు గురిచేస్తున్నాడు. భార్యాబిడ్డలను కొడుతూ చిత్రహింసలు పెడుతున్నాడు. నిన్న రాత్రి భర్త దాడిలో స్పృహ కోల్పోయిన భార్య ఆస్పత్రిలో చికిత్స పొందారు. అనంతరం తన భర్తపై గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.