AP: కూటమి పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. పాలనా వైఫల్యాలను ప్రజల దృష్టి నుంచి మళ్లించేందుకే సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని విమర్శించారు. అనంతపురం జిల్లాలో తన్మయి కనిపించడం లేదని పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, దారుణస్థితిలో ఆమె చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.