భారీగా తగ్గిన నిమ్మ ధరలు.. కేజీ రూ.15!

70చూసినవారు
భారీగా తగ్గిన నిమ్మ ధరలు.. కేజీ రూ.15!
AP: నిమ్మకాయల ధరలు భారీగా తగ్గాయి. దాంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఇదే సమయంలో నిమ్మ ధరలు కేజీ రూ.100 పలకగా.. ఇప్పుడు రూ.15-20కే కేజీ పలుకుతోందని రైతులు అంటున్నారు. ఏలూరు జిల్లాలోని రైతులు తోటల్లో నిమ్మ కాయలను కోయకుండా చెట్లకే వదిలేస్తున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రావట్లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి.. నిమ్మకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్