మందుబాబులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన మద్యం వ్యాపారి

57చూసినవారు
మందుబాబులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన మద్యం వ్యాపారి
AP: మందుబాబులకు ఓ మద్యం వ్యాపారి కిక్ ఇచ్చే బంపర్ ఆఫర్ ప్రకటించాడు. కాకినాడకు చెందిన ఓ మద్యం వ్యాపారి ‘రండి.. మందు తాగండి.. లాటరీలో గెలవండి’ అంటూ ఏకంగా పోటీ ఏర్పాటు చేశాడు. 'మా దగ్గర మద్యం కొన్న వారికి టోకెన్లు ఇస్తాం. లాటరీ తగిలిన వాళ్లకు కారు, బైకు, సెల్‌ఫోన్ వంటి రూ.1.5 లక్షల వరకు విలువైన గిఫ్టులు ఉన్నాయి. మొదటి బహుమతి గెలిస్తే ఏకంగా థాయిలాండ్ వెళ్లొచ్చు' అని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్