ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసింది. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వలేమని పేర్కొంది. కాగా, గతంలో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. ఈ తీర్పును కృష్ణ మోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.