AP: గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై కూటమి ప్రభుత్వం దూకుడు పెంచింది. ఇప్పటికే విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. తాజాగా ఎక్సైజ్ శాఖ అధికారులను కూడా ఈ బృందంలో సభ్యులుగా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బృందంలో నియమించిన అధికారులను వెంటనే రిలీవ్ చేసి విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుకు రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిషాంత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.