YCP నాయకులకు ఐటీ మంత్రి నారా లోకేష్ ఛాలెంజ్ విసిరారు. APలో ఎక్కడైనా డేటా చోరీ జరిగిందని నిరూపిస్తే రూ.10 కోట్లు కానుక కింద ఇస్తానని సవాల్ విసిరారు. 'ప్రభుత్వం తరఫున కాకుండా వ్యక్తిగతంగా నేనే చెక్ ఇస్తా. తనకు ఫోనే లేదని చెప్పిన జగన్ కు వాట్సాప్ గవర్నెన్స్ గురించి ఏమి తెలుస్తుంది?. మేం గతంలో అధికారంలో ఉన్నప్పుడు డేటా చోరీ చేసినట్లు ఆరోపించిన YCP.. ఐదేళ్లలో నిరూపించలేకపోయింది' అని లోకేష్ తెలిపారు.