ఏపీలో కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వాలంటూ పార్టీలో పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. అయితే పార్టీలో ఒక వ్యక్తి, ఒకే పదవిలో మూడు పర్యాయాలకు మించి ఉండకూడదనేది తన వ్యక్తిగత అభిప్రాయం అని, దీనిపై పార్టీ నేతలతో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగా తాను కూడా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని వదులుకోబోతున్నట్లు లోకేష్ వెల్లడించారు.