నడిరోడ్డుపై మంటల్లో కాలిపోయిన లారీ (వీడియో)

1087చూసినవారు
అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మలయనూరు గ్రామ సమీపంలో ఓ లారీ మంటలకు ఆహూతైంది. లారీ చిత్రదుర్గం నుంచి అనంతపురం వెళ్తుండగా మలయనూరు రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ లారీ నుంచి కిందకు దూకేసి ప్రాణాలు కాపాడుకున్నాడు. అయితే మంటలకు లారీ మొత్తం కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్