AP: కడప జిల్లా కమలాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చదిపిరాళ్ల వద్ద బైక్‌ను వెనుక నుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో కమలాపురానికి చెందిన బాలాజీ అనే వ్యక్తి మృతి చెందాడు. బాలాజీ స్థానికంగా ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తుంటారు. విధులకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ప్రమాదంలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మృతదేహాన్ని కడప రిమ్స్‌కు తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.