AP: ఏలూరు జిల్లా చటకాయ గ్రామానికి చెందిన రోజా కుమార్, నత్తగుళ్లపాడుకు చెందిన లక్ష్మీప్రసన్న కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ పెళ్లి చేసుకుని నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం పోలీసులను ఆశ్రయించారు. ప్రేమ జంటను కైకలూరు తీసుకొస్తుండగా.. శ్రీపుర్ర సమీపంలో చటకాయ గ్రామస్థులపై సత్తగుళ్లపాడు వాసులు దాడి చేశారు. గాయపడిన వారిని కైకలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దర్యాప్తు జరుగుతోంది.