AP: పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం మండలంలో షాకింగ్ ఘటన జరిగింది. అనూష(19) అనే డిగ్రీ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె సత్యనారాయణ అనే వ్యక్తిని ప్రేమిస్తోంది. వారిద్దరూ ఈ నెల 3న ఫోన్‌లో మాట్లాడుకుంటుండగా గొడవ జరిగింది. కాసేపటికి సత్య అనూష.. చెల్లికి ఫోన్ చేసి మీ అక్క చనిపోతా అంటుంది చూడమని చెప్పగా.. అప్పటికే చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.