వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వివాదం రోజుకోక మలుపు తిరుగుతోంది. తాజాగా దివ్వెల మాధురి మీడియా ముందుకు వచ్చి సంచలన ఆరోపణలు చేశారు. తనపై వాణి కుటుంబ సభ్యులు హత్యాయత్నం చేశారన్నారు. అంతేకాకుండా తన ఇంట్లోకి అనుమతి లేకుండా ఎవరు రావడానికి అర్హత లేదన్నారు. యాక్సిడెంట్ సమయంలో దువ్వాడ శ్రీను వాయిస్, తన వాయిస్ క్రియేట్ చేశారన్నారు. దువ్వాడకు ఇల్లు అద్దెకు ఇస్తానని మాధురి తెలిపారు.